వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌ కోసం ఈ నయా ఫీచర్‌!

-

మీరు వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌గా కొనసాగుతున్నారా? అయితే ఈ ఫీచర్‌ మీ కోసమే సృష్టించింది వాట్సాప్‌. అయితే వాట్సప్‌ గ్రూప్స్‌ క్రియేట్‌ చేసినవారికి గుడ్‌ న్యూస్‌. వాట్సప్‌ గ్రూప్‌ అడ్మిన్కు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

  • ఇటీవల వాట్సాప్‌ డిసప్పియరింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ ఫీచర్‌ కేవలం ఇండివిజ్యువల్‌ ఛాట్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫీచర్‌ను గ్రూప్లకు కూడా అందుబాటులోకి తేనుంది వాట్సాప్‌. బీటా వినియోగదారులు ఇప్పటికే ఈ ఫీచర్‌ను వాడుతున్నారు. వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌గా ఉన్న వారు ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు. వాట్సప్‌ గ్రూప్‌లో Edit group info ట్యాబ్‌లో ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులో ఉంది.
  • వాట్సప్‌లో మీరు ఏదైనా ఛాట్‌కు డిసప్పియరింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌ యాక్టివేట్‌ చేస్తే అందులోని మెసేజెస్, ఫైల్స్‌ అన్నీ వారం రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా డిలీట్‌ అవుతాయి. దీంతో మీ సమయం వృథా కాదు.
  • ఇప్పటికే డిసప్పియరింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌ను వ్యక్తిగత ఛాట్స్‌కి ఉపయోగించుకుంటున్నవారు. ఇప్పుడు అదే ఫీచర్‌ను గ్రూప్స్‌కి కూడా రిలీజ్‌ చేస్తోంది వాట్సప్‌. అంటే మీరు వాట్సప్‌ గ్రూప్‌లో డిసప్పియరింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌ ఉపయోగించుకోవచ్చు.
  • ప్రస్తుతం గ్రూప్‌ అడ్మిన్లకు మాత్రమే డిసప్పియరింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌ పనిచేస్తోంది. గ్రూప్‌ అడ్మిన్లు అనుమతి ఇస్తే గ్రూప్‌ మెంబర్స్‌ కూడా వాడుకోవచ్చు. ఏదైనా వాట్సప్‌ గ్రూప్‌లో డిసప్పియరింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌ను ఆన్‌ చేశారంటే ఆ గ్రూప్‌లోని మెసేజెస్‌ అన్నీ వారం రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా మాయమైపోతాయి.
  • ప్రస్తుతం వారం రోజుల మెసేజెస్‌ మాత్రమే డిలిట్‌ అయ్యేలా డిసప్పియరింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌ పనిచేస్తోంది. త్వరలో ఈ సమయాన్ని 24 గంటలకు తగ్గించాలని భావిస్తోంది వాట్సప్‌. ఈ ఫీచర్‌ను కూడా పరీక్షిస్తోంది.
  • డిసప్పియరింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌లో 24 గంటల టైమ్‌ కూడా యాడ్‌ అయిందంటే ఇక మీరు అవసరం లేని మెసేజెస్‌ అన్నీ ఆటోమెటిక్‌గా డిలిట్‌ చేయొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news