మీరు ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే ఈ ఐడియా మీకోసం. ఈ వ్యాపారం చేస్తే మీకు మంచి లాభాలు వస్తాయి. పైగా గేదె పాల కంటే ఆవు పాలకి ఎప్పుడు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. పైగా పాల ఉత్పత్తి కంపెనీలు కూడా వ్యాపారం చేస్తున్నారు. ఇక ఆవు పాలు బిజినెస్ కి సంబంధించి పూర్తి వివరాలని చూసేద్దాం.
పాలు ఎక్కువ ఇచ్చే ఆవుల్లో గిర్ జాతి ఆవులు బెస్ట్. పైగా పెంచడానికి ఖర్చు చాలా తక్కువే అవుతుంది. పాల ఉత్పత్తి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. దీనితో మీ బిజినెస్ బాగుంటుంది. పైగా ఈ ఆవుల్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ. అందువల్ల త్వరగా వ్యాధుల బారిన పడవు. కాబట్టి వీటిని కొనుగోలు చెయ్యడమే మంచిది.
వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ వుంది. ఇవి ఎక్కువగా రాజస్థాన్లోని అజ్మీర్, హర్యానాలో పెంచుతున్నారు. ఇవి గుజరాత్ కి చెందినవి. అలానే ఈ ఆవులు 12 నుంచి 15 ఏళ్లు బతుకుతాయి. 6 నుంచి 12 పిల్లలు దాక కూడా పెడుతుంది. గిర్ జాతి ఆవు రోజుకు 12 నుంచి 20 లీటర్ల పాలు ఇస్తాయి.
పాల ఉత్పత్తిని పెంచేందుకు ఈ ఆవులకు సరైన దాణా పెట్టాల్సి ఉంటుంది. అలానే షెడ్ ని మైంటైన్ చెయ్యాలి. ఆవుని బట్టి ధర ఉంటుంది. ఒక్కో ఆవు ధర రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల దాకా ఉంటుంది. ఏది ఏమైనా పెట్టుబడి తక్కువే లాభాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ బిజినెస్ చేస్తే లక్షల్లో లాభాలు పొందొచ్చు.