మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉన్న కొన్ని సంకేతాలు.. వెంటనే మానుకోండి.

-

ఆన్ లైన్ హ్యాకింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. మొబైల్ ఫోన్ ని క్షణాల్లో హ్యాక్ చేస్తున్నారు. అందుకే జాగ్రత్త చాలా అవసరం. ఆదమరిచి ఏ చిన్న క్లూ మరిచినా మీ ఫోణ్ హ్యాక్ అయిపోవడం ఖాయం. అసలు హ్యాక్ అయ్యే అవకాశాలు ఎలా ఉంటాయనేది తెలుసుకుంటే బాగుంటుంది.

కాంటెస్ట్ మెయిల్ క్లిక్ చేసినపుడు

మీరు ఈ పోటీలో పాల్గొంటున్నారు. ఇందులో గెలిసే 5లక్షలు మీవే అని కాంటెస్ట్ మెసేజ్ లు వస్తుంటే, వాటిని క్లిక్ చేయకండి. అలాంటి నంబర్లని బ్లాక్ లిస్టులో పెట్టండి. క్లిక్ చేసారంటే అయిపోయినట్టే.

అనుమానాస్పద ఫోన్ కాల్స్

మీకెలాంటి పరిచయం లేని, మీ భాషకానీ వారు ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతుంటే, ఆ ఫోన్ నంబర్ మన దేశం నుండి కానట్లయితే వాటిని ఎత్తకుండా ఉండాలి. ఎత్తారో మాల్వేర్స్ ఫోన్లోకి వెళ్ళే అవకాశం ఉంది.

ఒకే పాస్ వర్డ్ అన్నింటికీ ఉన్నప్పుడు

మీకు కావాల్సిన అన్ని సమాచారాలకి ఒకే పాస్వర్డ్ పెట్టినట్లయితే హ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. అందుకే ప్రతీదానికి వేరు వేరు పాస్వర్డ్ పెట్టడం మర్చిపోవద్దు. అలాగే పాస్ వర్డ్ బలహీనంగా ఉన్నట్లయితే కూడా హ్యాక్ అవుతుంది. మీ పాస్వర్డ్ లో ఆల్ఫాబెట్స్ తో పాటు నంబర్స్, ఇంకా స్పెషల్ గుర్తులు ఉండేలా చూసుకోండి.

యాప్స్, ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేయనపుడు

తరచుగా యాప్స్, ఆపరేటింగ్ సిస్టమ్ ని అప్డేట్ చేస్తూ ఉండాలి. దానివల్ల కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది కాబట్టి ఏ గోలా ఉండదు.

కాఫీ షాపుల్లో మీ కంప్యూటర్ ని సెక్యూరిటీ లేకుండా వదిలేసినపుడు

కాఫీ షాపుల్లో ల్యాప్ టాప్ ముందు పెట్టుకుని వర్క్ చేస్తున్నట్లయితే, లాక్ వేయకుండా ల్యాప్ టాప్ విడిచి వెళ్ళవద్దు. చుట్టుపక్కల వాళ్ళు ఎలాంటి వారనేది తెలియదు కాబట్టి జాగ్రత్త అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news