తెలుగు రాష్ట్రాల ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు

మన తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆస్పత్రులు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నాయి. దాదాపుగా అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు మానవత్వం లేకుండా ప్రవర్తించడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. ప్రజల ప్రాణాలు పోతున్నా సరే ఆస్పత్రులు కనికరం లేకుండా డబ్బులు వసూలు చేయడం ఒకటి అయితే ఆరోగ్య బీమా ఉన్నా సరే కనీసం పట్టించుకోవడం లేదు. బీమా కుదరదు అని చెప్పెస్తున్నాయి.

డబ్బులు కడితేనే జాయిన్ చేసుకుంటామని చెప్తున్నాయి. లేదంటే వేరే ఆస్పత్రికి వెళ్ళాలి అని ఆక్సీజన్ బెడ్ కావాలంటే నాలుగు లక్షలు కట్టాలని అలా అయితేనే బెడ్ దొరుకుతుందని చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చెప్పినా సరే లెక్క చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు అంతంత మాత్రం గానే ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులలో బెడ్స్ లేక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే ఇలా వ్యవహరించడంతో ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతుంది.