మన దేశంలో ఆక్సీజన్ కొరత చాలా తీవ్రంగా ఉన్న నేపధ్యంలో ఆక్సీజన్ కొరతకు సంబంధించి దేశంలో అతిపెద్ద ఆక్సీజన్ ఉత్పత్తి దారు అయిన లిండే పిఎల్‌సికి చెందిన మోలోయ్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే నెల మధ్య భాగానికి కాస్త ఆక్సీజన్ కొరత తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఉత్పత్తి 25 శాతం పెరిగిందని, కరోనావైరస్ కేసుల్లో అనూహ్య పెరుగుదల కారణంగా డిమాండ్ పెరిగిందని ఆయన చెప్పారు.
లిండే ఇండియా మరియు ప్రాక్సేర్ ఇండియా – మరియు ఇతర సరఫరాదారులు వచ్చే నెల మధ్య నాటికి రోజుకు మొత్తం 9,000 టన్నులకు పైగా ఉత్పత్తిని పెంచుతున్నారని ఆయన వివరించారు. పెద్ద మొత్తంలో ద్రవ వైద్య ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి భారత్ సుమారు 100 క్రయోజెనిక్ కంటైనర్లను దిగుమతి చేసుకుంటుందని బెనర్జీ వివరించారు. డిమాండ్ రెట్లు పెరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.