మంత్రి ఈటలపై 100 ఎకరాల అసైన్డ్ భూములు కబ్జా కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. మంత్రి ఈటల భూ కబ్జా కేసులో విచారణ కొనసాగుతుంది. భూ కబ్జాలపై మరో మూడు గంటల్లో నివేదిక అoదనుoది. అచ్చంపేటలో అసైన్డ్ భూములు కబ్జా అయిన మాట వాస్తవమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు. బాధితులతో మాట్లాడి వివరాలను సేకరిస్తున్నాం అన్నారు. భూములు కబ్జా చేశారని ప్రాధమిక విచారణలో తేలింది అని వివరించారు.
బాధితులకు అన్యాయం జరిగింది అని పేర్కొన్నారు. విచారణ అధికారుల దగ్గరకు బాధితులు క్యూ కట్టారు. తమ భూములను కూడా లాగేసుకున్నారని అధికారులకు ఫిర్యాదులు చేసారు. కబ్జా చేశారని ఆరోపణలున్న 177 ఎకరాల్లో సర్వే జరుగుతుంది. 3 టీమ్లు డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నాయి. మరో మూడు గంటల్లో నివేదిక సమర్పిస్తున్నాము అని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ వివరించారు.