దేశవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. అనేక మంది ఇండ్లు, హాస్పిటళ్లలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ పెద్ద ఎత్తున అవసరం అవుతోంది. దీంతో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లకు డిమాండ్ భారీగా ఏర్పడింది. అయితే కోవిడ్ బాధితులు నెబ్యులైజర్తో చికిత్స తీసుకోవచ్చు.. అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కోవిడ్ చికిత్స తీసుకునే వారు ఆక్సిజన్ కోసం నెబ్యులైజర్ వాడవచ్చని, ఆక్సిజన్ సిలిండర్ లేదా కాన్సన్ట్రేటర్ లేకపోయినా ఏమీ కాదని.. ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ లో ఆ వార్త ఫేక్ అని తేలింది. అదంతా అబద్దమేనని, కోవిడ్ చికిత్సలో ఆక్సిజన్ కోసం నెబ్యులైజర్ వాడకూడదని, అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పీఐబీ తెలియజేసింది.
#WhatsApp पर शेयर हो रहे एक वीडियो में नेबुलाइजर मशीन को ऑक्सीजन सिलेंडर के विकल्प के रूप में दिखाया जा रहा है।#PIBFactCheck: यह वीडियो #फर्जी है। इसका कोई वैज्ञानिक प्रमाण नहीं है कि नेबुलाइजर मशीन, रक्त में ऑक्सीजन के स्तर को संतुलित बनाए रख सकता है । pic.twitter.com/hNSUZssUl5
— PIB Fact Check (@PIBFactCheck) April 28, 2021
నెబ్యులైజర్ ను సాధారణంగా శ్వాస సమస్యలు ఉన్నవారు వాడుతారు. ఆస్తమా ఉన్నవారితోపాటు చిన్నారుల్లో జలుబు, ముక్కు దిబ్బడ ఉంటే శ్వాస సరిగ్గా ఆడేందుకు నెబ్యులైజర్ ఉపయోగిస్తారు. అంతేకానీ దాంతో ఆక్సిజన్ వెలువడదు. కనుక కోవిడ్ బాధితులు ఈ విషయం గమనించాలి. కోవిడ్ చికిత్సలో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లకు బదులుగా నెబ్యులైజర్లను వాడరాదు.