సన్‌రైజర్స్‌ కీలక నిర్ణయం… కెప్టెన్సీలో మార్పు

-

  1. ఈ సీజన్ ఐపీఎల్ లో పేలవ ప్రదర్శన చేస్తూ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీలో మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం శనివారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. కేన్ విలియమ్సన్ సన్‌రైజర్స్‌ కెప్టెన్ గా కొనసాగుతాడని స్పష్టం చేసింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ నుంచి ఈ సీజన్ ముగిసే వరకు విలియమ్సన్ సారథ్య బాధ్యతలను చేపట్టనున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ జట్టుకు సేవలు అందిస్తాడని తెలిపింది. అలానే రేపటి మ్యాచ్ లో విదేశీ ఆటగాళ్ళ కూర్పులో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.

అయితే ఈ సీజన్ లో సన్‌రైజర్స్‌ జట్టు ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి కేవలం ఒకే విజయం మాత్రమే నమోదు చేసి రెండు పాయింట్లతో అట్టడుగున ఉంది. ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో 2018లో డేవిడ్ వార్నర్ పై క్రికెట్‌ ఆస్ట్రేలియా నిషేధం విధించిన విషయం తెల్సిందే. దీంతో నిషేధం కారణంగా 2018, 2019 ఐపీఎల్ సీజన్లకు డేవిడ్ వార్నర్ దూరమయ్యాడు. ఆ సమయంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్ గా కేన్ విలియమ్సన్ బాధ్యతలు చేపట్టాడు. వార్నర్ పై నిషేధం పూర్తి కావడంతో అతడు 2020 సీజన్ లో తిరిగి జట్టులోకి చేరడంతో కెప్టెన్సీ పగ్గాలను కూడా సన్‌రైజర్స్‌ వార్నర్ కే అప్పగించింది.

అయితే ఈ సీజన్ లో వరుస ఓటములతో సతమతవుతున్న రైజర్స్ హైదరాబాద్ జట్టు విలియమ్సన్ నాయకత్వంలో అయినా తిరిగి పుంజుకుంటుందో చూడాలి. కాగా విలియమ్సన్ అంతర్జాతీయ కెప్టెన్సీ అనుభవం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశం.సన్‌రైజర్స్‌ బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నా బ్యాట్స్ మెన్ విఫలమవడం జట్టుకు ప్రతికూలంగా మారింది. మరి ముఖ్యంగా మిడిలార్డర్ సమస్య జట్టును వేధిస్తోంది. ఇన్నింగ్స్ చివర్లో బ్యాట్ తో మెరుపులు మెరిపించే ఆటగాడు లేకపోవడంతో రైజర్స్ దాదాపుగా అన్ని మ్యాచ్ లలో విజయం ముంగిట బోర్లా పడుతుంది. అనుభవం కలిగిన భారత బ్యాట్స్ మెన్ సన్‌రైజర్స్‌ జట్టులో లేకపోవడంతో కూడా జట్టుకు పెద్ద మైనస్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news