కరోనాపై వెంటనే రంగంలోకి దిగిన కేసీఆర్

కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం కేసీఆర్ ఆదేశించారు. రెమిడెసివర్ వంటి మందుల విషయంలో గానీ, వాక్సీన్ ల విషయంలో గానీ, ఆక్సీజన్ మరియు బెడ్ ల లభ్యత విషయంలో గానీ, ఏ మాత్రం లోపం రానీయవద్దని, సిఎస్ ను సిఎం కెసిఆర్ ఆదేశాలు ఇచ్చారు.

సీఎం కేసీఆర్

అనుక్షణం కరోనా పర్యవేక్షణకు గాను సిఎంవో నుంచి సిఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులందరూ జాగ్రత్తగా  వ్యవహరిస్తూ, చక్కగా పనిచేసి అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుండి బయట పడేయాలని సిఎం విజ్ఞప్తి చేసారు.