పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తాజాగా ప్రకటించారు. పుదుచ్చేరిలోని మొత్తం 30 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 6 న ఒకే దశలో జరిగాయి. 10.04 లక్షల మంది ఓటర్లలో దాదాపు 82 శాతం మంది ఏప్రిల్ 6 న కేంద్ర పాలిత ప్రాంతంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ), బీజేపీ కలిసి పుదుచ్చేరిలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి.
మొత్తం 30 నియోజకవర్గాల్లో 16 స్థానాల్లో ఏఐఎన్ఆర్సీ అభ్యర్థులను నిలబెట్టగా, బీజేపీ తొమ్మిది స్థానాల్లో పోటీ చేసింది.
పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాల నుండి గెలిచిన విజేతల జాబితా ఇలా ఉంది
1. మన్నాడి పేట – ఏఐఎన్ఆర్సీ – టీపీఆర్ సెల్వామె
2. తిరుబువనై – ఏఐఎన్ఆర్సీ – బి.కొబిగ
3. ఒస్సుడు – కాంగ్రెస్ – ఇ.తిప్పైంతన్
4. మంగళం – ఏఐఎన్ఆర్సీ – ఎస్వీ సుగుమారన్
5. విల్లియనుర్ – కాంగ్రెస్ – ఎ.నమశ్శివాయమ్
6. ఒజుకరై – ఏఐఏడీఎంకే – ఎ.అన్బళగన్
7. కదిర్కమమ్ – ఏఐఎన్ఆర్సీ – ఎన్ఎస్జే జయబల్
8. ఇందిరానగర్ – ఏఐఎన్ఆర్సీ – ఎన్.రంగసామి
9. తట్టంచవాడి – ఏఐఎన్ఆర్సీ – అశోక్ ఆనంద్
10. కామరాజ్ నగర్ – కాంగ్రెస్ – వీఈ వైతిలింగం
11. లాస్పేట – కాంగ్రెస్ – వీపీ శివకొలుందు
12. కాలాపేట – కాంగ్రెస్ – ఎంవోహెచ్ఎఫ్ షాజహాన్
13. ముతియాల్పేట – ఏఐఏడీఎంకే – మణికందన్
14. రాజ్ భవన్ – కాంగ్రెస్ – లక్షినారాయంద్
15. ఒపుళం – ఏఐఏడీఎంకే – అన్బళగన్
16. ఒర్లియంపేట – డీఎంకే – ఆర్.శివ
17. నెల్లితొపె – కాంగ్రెస్ – ఎ.జాన్ కుమార్
18. ముదిలియర్ పేట – ఏఐఏడీఎంకే – ఎ.భాస్కర్
19. అరియన్కుప్పమ్ – కాంగ్రెస్ – టి.జియమూర్తి
20. మనవెలి – కాంగ్రెస్ – అనంత రామన్
21. ఎంబళం – కాంగ్రెస్ – కందసామి
22. నెట్టపక్కం – కాంగ్రెస్ – విజియవెని
23. బహౌర్ – కాంగ్రెస్ – దానవెలొ
24. నెడుంగడు – ఏఐఎన్ఆర్సీ – చందిర ప్రియాంగ
25. తిరునల్లర్ – కాంగ్రెస్ – ఆర్.కమలక్కన్నన్
26. కరైకల్ నార్త్ – ఏఐఎన్ఆర్సీ – తిరుమురుగన్
27. కరైకల్ సౌత్ – ఏఐఏడీఎంకే – కేఏయూ అసన
28. నెరవి టీఆర్ పట్టినమ్ – డీఎంకే – ఎ.గీత
29. మహె – స్వతంత్ర – వి.రామచంద్రన్
30. యానాం – కాంగ్రెస్ – మల్లాడి కృష్ణారావు