కరోనా కుటుంబాల్లో ఎంతటి తీవ్రం దుఃఖాన్ని మిగులుస్తుందో చూస్తూనే ఉన్నాం. తల్లికి కొడుకును, పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేస్తోంది. జీవితానికి సరిపడే శిక్ష వేస్తోంది. పచ్చని కుటుంబాల్లో కన్నీళ్లు నింపుతోంది. కరోనా కారణంగా ఇప్పటికే ఎన్నో మనసులను కలిచివేసే ఘటనలు చూశాం. కానీ ఇప్పుడు అంతకన్నా ఘోరమైన ఘటన జరిగింది.
పాకిస్థాన్-ఇండియా సరిహద్దులోని బార్మెర్ జిల్లా రాయ్ కాలనీలో దామోదర్ దాస్ అనే వ్యక్తి తన కూతురులో కలిసి జీవిస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఆయన కరోనా బారిన పడ్డాడు. దీంతో ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందించినా.. చివరికి లాభం లేకుండా పోయింది.
దామోదర్ దాస్ కూడా కరోనాకు బలైపోయాడు. దీంతో గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తండ్రికి తలకొరివి పెట్టిన శారద.. తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయింది. తన తండ్రి లేని జీవితం వద్దంటూ.. తండ్రి చితిమంటల్లోకి దూకింది. దీంతో షాక్ అయిన అక్కడున్న వారు.. ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించారు. కాగా ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ ఘటన తో జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.