త‌మ్ముడిని ప్రేమించిన అక్క‌.. మామిడి తోట పేరుతో ట్విస్టు!

-

ప్రేమ గుడ్డి దంటారు. అది ఎప్పుడు ఎవ‌రి మ‌న‌సుల్లో పుడుతుందో తెలియ‌దు. కానీ ఇప్పుడు చెప్ప‌బోయే ప్రేమ‌క‌థ విచిత్ర‌మైన‌ది. ఓ యువ‌తి త‌న త‌మ్ముడితో ప్రేమ‌లో ప‌డింది. అక్క‌డితో ఆగ‌కుండా ఏకంగా ఇద్ద‌రూ ఇంట్లోంచి పారిపోయారు. నిజ‌మండి. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇదే నిజం. వీరు చేసిన ప‌నితో ఇరువురి త‌ల్లిదండ్రులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

మెద‌క్ జిల్లా కేంద్రంలోని ఓ ప్ర‌యివేటు కాలేజీలో డిగ్రీ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న ఓ యువ‌తి..త‌న సొంత చిన్నాన్న కొడుకును ప్రేమించింది. కాలేజీలు లేక‌పోవ‌డంతో ఇద్ద‌రూ చెట్టాపట్టాలేసుకుని బయట తిరగేవారు. ఎవ‌రికీ అనుమానం రాలేదు. కాగా రెండు రోజుల క్రితం స‌ద‌రు యువ‌తి త‌మ్ముడిని తీసుకుని ఇంట్లోంచి పారిపోయింది. ప‌ని నిమిత్తం బ‌య‌ట‌కు వెళ్లిన త‌ల్లిదండ్రులు వ‌చ్చే లోపే యువ‌తి ఈ ఘ‌న‌కార్యం చేసింది.

అయితే ముందుగా ప్లాన్ వేసుకున్న యువ‌తి.. త‌న నాన‌మ్మ‌కు మామిడితోట చూసి వ‌స్తాన‌ని చెప్పి వెళ్లింది. ఎంత‌కూ రాక‌పోవ‌డంతో.. కొడుకు, కోడ‌లికి విష‌యం చెప్పింది. వారు వెత‌క‌గా అస‌లు విష‌యం తెలిసింది. ఇక కూతురు చేసిన ప‌నికి ఆ త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. ఇంత ప‌నిచేస్తుందనుకోలేద‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి చేద్దామ‌నుకున్న‌ట్టు ఆవేద‌న చెందారు. ఇక ఈ విష‌యం ఇప్పుడు జిల్లాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news