ఆక్సీజన్ ప్లాంట్ లకు సంబంధించి జగన్ సంచలన నిర్ణయం

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఆక్సీజన్ కొరత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది ఏంటీ అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక తాజాగా ఏపీ సర్కార్ ఒక కీలక ఆదేశాలు ఇచ్చింది. 50 క్రాయోజెనిక్ ఆక్సిజన్ టాంకర్ లు కొనుగోలు చేయాలని 49 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్ ల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

వాటికోసం సివిల్, ఎలక్ట్రికల్ పనులకు, 10వేల ఆక్సిజన్ పైప్లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ పైప్లైన్ మెయింటైనెన్సు కు జిల్లాకు నెలకు 10 లక్షలు చప్పున 6 నెలలకు పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. మొత్తంగా సుమారు 310 కోట్ల రూపాయల కు పరిపాలన అనుమతులు ఇస్తూ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news