ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు అంటారు కదా. దాన్ని నిజం చేసి చూపించాడు రితేశ్ అనే యువకుడు. అతడి ఫ్రెండ్ అమిత్ ట్రెయిన్ ఎక్కబోతూ జారి ప్లాట్‌ఫాం, ట్రెయిన్ మధ్యలో పడిపోయాడు. ఇంతలో ట్రెయిన్ కదిలింది. ఏం చేయాలో తెలియక.. రితేశ్.. అలాగే ట్రెయిన్ పోయే దాకా.. అమిత్ చేతులు పట్టుకొని కూర్చున్నాడు. ట్రెయిన్ పోయాక.. అమిత్‌ను పైకి లాగారు. ట్రెయిన్ వెళ్లేదాక.. తన లైఫ్‌ను రిస్క్‌లో పెట్టి మరీ.. అతడి చేతులను పట్టుకొని ప్లాట్‌ఫాం వైపు లాగడం వల్లే అమిత్ బతికి బయటపడ్డాడు. లేకపోతే అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ముంబైలోని కపోలీ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్నది.
రన్నింగ్ ట్రెయిన్, ప్లాట్‌ఫాం మధ్య చిక్కుకుపోయిన యువకుడు.. వీడియో
-