ఆదాశ‌ర్మ‌కు క‌లిసిరాని టాలీవుడ్‌.. అక్క‌డ మాత్రం ఫుల్ బిజీ

-

ఆదాశ‌ర్మ‌.. అంటే అంద‌రికీ గుర్తొచ్చేది పాల‌రాతిశిల్పం లాంటి ఆమె అందాలే. అంతటి అందం ఆమె సొంతం. హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమాతో ప్లాప్‌ను మూట‌గ‌ట్టుకుంది. పోనీ ఆ త‌ర్వాతైనా అవ‌కాశాలు రాక‌పోతాయా అని చూసింది. కానీ సెకండ్ హీరోయిన్ ఛాన్సులే వ‌చ్చాయి. దీంతో చేసేది లేక వాటితోనే కాలం గ‌డిపింది.

అయినా స‌రే ఎక్క‌డా త‌గ్గ‌కుండా సినిమాల కోసం టాలీవుడ్ పెద్ద‌ల చుట్టూ తిరిగింది. సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, గ‌రం, క్ష‌ణం, క‌ల్కీ లాంటి సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చినా అవేమంత పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న‌వి కాక‌పోవ‌డంతో ఈ భామ టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పింది. ఆ త‌ర్వాత బాలీవుడ్‌పై ఫోక‌స్ పెట్టింది.

ఇక అక్క‌డ ప‌ర్వాలేద‌నిపించింది. కొన్ని సినిమాలు చేస్తూ ల‌క్ ప‌రీక్షించుకుంటోంది. దాంతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌ల‌లో కూడా న‌టిస్తోంది. ఈ భామ క‌రాటే, కుంగ్ ఫూ లాంటి వాటిలో మేటి. ఎప్ప‌టి క‌ప్పుడు త‌న హాట్‌, గ్లామ‌ర్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్ర‌కారు మ‌తి పోగొడుతోంది. ఈమె లేటెస్టుగా షేర్ చేసిన ఫొటోల‌ను మీరు చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news