తెలంగాణాలో లాక్ డౌన్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణా హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్ డౌన్ పై సడెన్ గా నిర్ణయం ఏ విధంగా తీసుకున్నారని ప్రశ్నించింది. కనీసం వీకెండ్ లాక్ డౌన్ ఆలోచన లేకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారని ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అంటే ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలంగాణా ప్రజల పరిస్థితి ఏంటీ…? వాళ్ళు ఏ విధంగా తెలంగాణా రావాలని ప్రశ్నించింది.
అదే విధంగా ఇక్కడ ఉన్న ఇతర రాష్ట్రాల వాళ్ళ పరిస్థితి ఏంటీ అని కూడా నిలదీసింది. ఇంత తక్కువ టైం లో ఇతర ప్రాంతాలకు ఏ విధంగా వెళ్తారు అనే నిర్ణయం తీసుకుంది. కాసేపటి క్రితం తెలంగాణా రాభుత్వం లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 10 రోజుల పాటు తెలంగాణాలో లాక్ డౌన్ అమలు చేస్తున్నామని తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది.