వైరస్ మూలాన్ని గుర్తించడానికి ఇంకా దర్యాప్తు చేయాలి: శాస్త్రవేత్తలు

-

కరోనా ఎక్కడ పుట్టిందనే విషయం, దాని మూలాలపై ఇంకా అస్పష్టత ఉంది. చైనాలోని ఒక ప్రయోగశాల నుంచి ఈ వైరస్ లీక్ అయిందనే వాదనలు గతం నుంచి వినిపిస్తున్నాయి. 2019 నుంచి ప్రపంచాన్ని అల్లకల్లోలం సృష్టిస్తోంది కరోనా. దాదాపు 3.34 మిలియన్ల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ట్రిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయేలా చేసింది. ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోలేని పరిస్థితి తీసుకొచ్చింది. అయితే కరోనా వైరస్ చైనాలో పుట్టిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ మహమ్మారి యొక్క మూలాన్ని గుర్తించడానికి దర్యాప్తు చేపట్టాల్సిన అవసరముందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని క్లినికల్ మైక్రో బయాలజిస్ట్ రవీంద్ర గుప్త, ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ పరిశోధన కేంద్రంలో వైరస్‌ల పరిమాణాన్ని అధ్యాయనం చేసిన జెస్సీ బ్లూమ్, మరో 18 మంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో వెల్లడించారు.

కరోనా వైరస్
కరోనా వైరస్

వైరస్ ఉద్భవం ఎక్కడ జరిగిందనే వాదనపై స్పష్టత రాలేదు. దీని కోసం మరింత పరిశోధన జరపాలని శాస్త్రవేత్తలు భావించారు. ఈ వైరస్ మూలాన్ని కూడా గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ల్యాబ్, జూనోటిక్ స్పిల్ఓవర్ నుంచి ప్రమాదవశాత్తు వైరస్ విడుదలైన, తగిన ఆధారాలు లేవని స్టాన్‌ఫర్డ్‌లోని మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డేవిడ్ రెల్‌మన్ తెలిపారు. వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సమతుల్య పరిశోధన చేయలేదని ఆయన పేర్కొన్నారు.

శాస్త్రవేత్తలు సమర్పించిన నివేదికలో.. జనవరి, ఫిబ్రవరి నెలలో వుహాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో డబ్ల్యూహెచ్ఓ నేతృత్వంలోని బృందం వైరస్‌పై పరిశోధనలు చేసింది. ఈ వైరస్ బహుశా గబ్బిలాల నుంచి మనుషులు, లేదా మరొక జంతువు నుంచి వ్యాప్తి చెంది ఉందవచ్చని, లేదా ప్రయోగశాల నుంచి లీక్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టమైన కారణాలు లేవు. ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది.. దీనికి మూలం ఏదనే విషయంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రయోగశాల స్పిల్ఓవర్‌ల గురించి పరికల్పనలను తీవ్రంగా పరిగణించాలని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనిపై ఇంకా పరిశోధన జరపాల్సిన అవసరం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news