బ్రేకింగ్: తిరుపతి స్విమ్స్ లో పొంచి ఉన్న భారీ ముప్పు…?

-

ఆక్సిజన్ సంక్షోభం అంచున తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి. ఆసుపత్రికి పంపే ఆక్సిజన్ లో కోత విధించాల్సిందిగా సరఫరాదారును తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. 15ఏళ్లుగా తమిళనాడు లోని ఎయిర్ వాటర్ కంపెనీ నుంచి స్విమ్స్ కి ఆక్సిజన్ వస్తుంది. రెండు విడతలుగా రోజుకు 14 కేఎల్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం 8కేఎల్ కి మించి ఆక్సిజన్ పంపించలేమని స్విమ్స్ కి గుత్తేదారు స్పష్టం చేసారు.

స్విమ్స్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులు 467 మంది ఉన్నారు. 90 శాతానికి పడకలకు ఆక్సిజన్ అవసరం ఉంది. రుయా ఘటన దృష్ట్యా పరిస్థితిని చిత్తూరు జిల్లా కలెక్టర్, స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ దృష్టికి స్విమ్స్ డైరెక్టర్ తీసుకువెళ్ళారు. తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరపాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news