తెలంగాణ‌లో ఆరోగ్య శ్రీ లొల్లి.. ఈ సారి ష‌ర్మిల వంతు

-

రాష్ట్రంలో ఇప్పుడు ఆరోగ్య శ్రీ చుట్టూ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. ఇప్ప‌టికే బీజేపీ, కాంగ్రెస్ క‌రోనా ట్రీట్ మెంట్‌ను ఆరోగ్య శ్రీలో చేర్చాలంటూ ప‌ట్టుప‌డుతున్నాయి. ఈ మ‌ధ్య టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డుతున్న వై.ఎస్‌. శ‌ర్మిల ఈ రోజు మ‌రోసారి మాట‌ల తూటాల‌ను సంధించారు.

అస‌లు తెలంగాణ‌లో ఆయుష్మాన్ భార‌త్‌ను ఎందుకు పెట్టారు, ఆరోగ్య శ్రీలో క‌రోనాను ఎందుకు చేర్చ‌ట్లేద‌ని ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్‌లో ఓవీడియోను పోస్టు చేశారు.పేద ప్ర‌జ‌లపై నిజంగా ప్రేమ ఉంటే ఆరోగ్య శ్రీలో క‌రోనాను చేర్చాల‌ని డిమాండ్ చేశారు.

ఆయుష్మాన్‌ భారత్ అయితే రాష్ట్రంలో కేవ‌లం 26.11 లక్షల మందికి మాత్రమే మేలు జ‌రుగుతుంద‌ని, అదే ఆరోగ్య శ్రీ అయితే 80ల‌క్ష‌ల కుటుంబాల‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్నారు.భ‌విష్య‌త్‌లో కూడా అస‌లు ఆరోగ్య‌శ్రీకి నిధులు ఆపేస్తారేమో అంటూ అనుమానం వ్య‌క్తం చేశారు. అయితే శ‌ర్మిల ట్వీట్‌పై నెటిజ‌న్లు కూడా స‌పోర్టు చేస్తున్నారు. మ‌రి దీనిపై టీఆర్ ఎస్ ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news