TS Polycet 2021 పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ మొదలు అయ్యింది. టెన్త్ పూర్తైన విద్యార్థులు అప్లై చేసుకో వచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఈ పరీక్ష కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యింది. జూన్ 11వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ఏ ఫైన్ చెల్లించక్కర్లేకుండా
రిజిస్టర్ చేసుకో వచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఇది ఇలా ఉంటే రూ.100 లేట్ ఫీజుతో జూన్ 13 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు అధికారులు. అలానే రూ. 300 లేట్ ఫీజు తో జూన్ 15 వరకు అప్లై చేసుకో వచ్చని నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://polycetts.nic.in/ వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకో వచ్చు. అయితే ఈ పరీక్ష ఎప్పుడు నిర్వహించే విషయం పై అధికారులు ఇంకా తేదీని ప్రకటించ లేదు. త్వరలో ఆ తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ విషయాన్నీ గమనించండి. విద్యార్థులు ఏమైనా సందేహాలుంటే 040-23222192 నంబరును సంప్రదించాలని సూచించారు.