ఈ ఏడాది మే 26 బుధవారం వైశాఖ పూర్ణిమ రోజన చంద్రగ్రహణం రాబోతోంది. అయితే ఇది భారత్ అంతటా ఉండదు. కేవలం కొన్ని చోట్ల మాత్రమే ఇది కనపడుతోంది. దీనికి గల కారణం ఏమిటంటే…? ఈ గ్రహణం ప్రారంభమైనప్పుడు భారత్ లో ఎక్కువ భాగం పగలు ఏర్పడుతుంది.
అందుకే అన్ని చోట్ల ఉండదు. గ్రహణ సమయానికి సంబంధించి చూస్తే.. సూతకం కాలం ఉదయం 06.15 గంటలకు మొదలవ్వనుంది. గ్రహణం ఆరంభం అయితే మధ్యాహ్నం 03.00 గంటలకు మొదలవుతుంది. ఖాగ్రాస్ ప్రారంభం మధ్యాహ్న 4.40 గంటలకు, గ్రహణ మధ్య కాలం 04.49 గంటలకు మరియు గ్రహణం ముగింపు 06.23 గంటలకు అవ్వనుంది.
గ్రహణం కనిపించే ప్రదేశాలు లేదా దేశాల్లో మాత్రమే సూతక కాలాన్ని పరిగణిస్తారు గమనించండి. ఇక గ్రహణం ఎక్కడెక్కడ ఉంటుంది అనేది చూస్తే.. ఈశాన్య రాష్ట్రాలు అయినా అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, బంగాల్, నాగాలాండ్.
త్రిపుర, తూర్పు ఒడిషా, మణిపుర్, అసోం, మేఘాలయలో కనిపిస్తుంది. విదేశాల లో అయితే జపాన్, బంగ్లాదేశ్, సింగపూర్, మయన్మార్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో చంద్ర గ్రహణం ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి. వీటిలో రెండు సూర్య గ్రహణాలు మిగిలిన రెండు చంద్ర గ్రహణాలు.