నెగెటివ్ టాక్ వ‌చ్చినా జోరు త‌గ్గ‌ని స‌ల్మాన్ రాధే.. ఇది మామూలు ట్రెండ్ కాదు!

-

ఓ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తేనే రికార్డు స్థాయిలో కలెక్ష‌న్స్ వ‌స్తాయి. అంతే కాదు మంచి క్రేజ్ కూడా ద‌క్కుతుంది. కానీ నెగెటివ్ టాక్ వ‌స్తే మాత్రం ఏ మాత్రం చూడ‌టానికి అభిమానులు ఇంట్రెస్ట్ చూప‌రు. అలాగే రికార్డుల ప‌రంగా కూడా వెన‌కే ఉంటుంది. కానీ బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ విష‌యంలో మాత్రం ఇది భిన్నంగా ఉంది.

స‌ల్మాన్ ఖాన్ ఏ సినిమా చేసినా అదొక ట్రెండ్ సెట్ట‌ర్ అవుతుందే. ఇప్పుడు రాధే రిలీజై ఓ స‌రికొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. ఒకేసారి థియేటర్లతో పాటు ఓటీటీలోనూ రిలీజ్ చేసిన మొద‌టి సినిమా ఇదే. అయితే ఈ సినిమాకు కాస్త నెగెటివ్ టాక్ వచ్చింది.

కానీ రాధే జోరు మాత్రం ఎక్క‌డా తగ్గట్లేదు. దీంతో అన్ని కేట‌గిరీల ప్ర‌జ‌ల‌కు దీన్ని చేరువ చేస్తోంది ఓటీటీ. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు మరో రికార్డు క్రియేట్ చేయ‌డానికి రెడీ అవుతోంది రాధే. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఉన్న యాపిల్ టీవీలో దీన్ని రిలీజ్ చేస్తున్నారు నిర్మాత‌లు. అంటే ఈ సినిమా ఇప్పుడు దాదాపు 65 దేశాల్లో ఆయా భాష‌ల్లో వ‌స్తుంద‌న్న మాట‌. ఎంతైనా స‌ల్మాన్ క్రేజ్ సూప‌ర్ క‌దా.

Read more RELATED
Recommended to you

Latest news