కేశ సంరక్షణ: ఆరోగ్యమైన కుదుళ్ళ కోసం అద్భుతమైన ఆయిల్స్..

-

ఆయిల్ మసాజ్ కేశాలకే కాదు శరీరానికి కూడా మంచిదే. ఆయిల్ మసాజ్ వల్ల మెదడులో చర్య జరిగి సరికొత్త మూడ్ ని క్రియేట్ చేస్తాయి. అందువల్ల చాలామంది ఆయిల్ మసాజ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఐతే మీకీ విషయం తెలుసా? రుతువుని బట్టి ఏ ఆయిల్ వాడాలనేది తెలుసుకోవాలి. ఉదాహరణకి, పొద్దుతిరుగుడు, ఆలివ్, కొబ్బరినూనెలు వేసవి కాలంలో మంచివి. అలాగే శీతాకాలంలో బాదం, ఆవాలు బాగా పని చేస్తాయి. అన్ని కాలాలకి పనికొచ్చే ఒకే ఒక్క ఆయిల్ నువ్వుల నూనె.

ప్రస్తుతం ఆరోగ్యకరమైన కుదుళ్ళ కోసం ఇంట్లో తయారు చేసుకునే ఆయిల్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

కరివేపాకు, కొబ్బరి నూనె

ఈ నూనె వల్ల జుట్టు గట్టి పడుతుంది. దీనిలో బీ విటమిన్ కారణంగా జుట్టుకు మెరిసే గుణం సంతరించుకుంటుంది. అంతేకాదు మంచి సువాసనని ఇస్తుంది.

దీన్నెలా తయారు చేసుకోవాలంటే,

కొద్దిగా కొబ్బరినూనెలో చేతినిండా కరివేపాకు వేసి ఒక పాత్రలో మరిగించాలి. పూర్తిగా నల్లగా మారిన తర్వాత ఒక చిన్న బాటిల్ లో తీసి ఉంచుకోవాలి.

ఉసిరి నూనె

ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా వాడగలిగే ఉసిరి నూనె కేశాలకు మంచి మేలు చేస్తుంది. జుట్టు విఛ్ఛినం అవడం, తెల్లగా మారడం, రాలిపోవడం వంటి సమస్యలను ఇది దూరం చేస్తుంది.

2ఉసిరికాయలను తీసుకుని 4ముక్కలుగా చేసి ఎండబెట్టాలి. అపుడు ఆ కాయలకి నువ్వుల నూనె ఇంకా కొద్దిగా కొబ్బరినూనె కలపాలి. ఆ తర్వాత దాన్ని ఒక పాత్రలో మరిగించాలి. చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో వేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news