ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం..

-

దేశంలోని వ్యవసాయ దారులందరికీ సంతోషాన్నిచ్చే వార్తని కేంద్రం అందించింది. ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్న కనీస మద్దతు పెంపుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2021-22 సంవత్సరానికి గాను ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో 1868రూపాయలుగా ఉండే క్వింటాల్ పత్తి ధర 72రూపాయలు పెరిగి 1940రూపాయలు అయ్యింది. అలాగే ఏ గ్రేడ్ వరి ధర 1960కిచేరింది.

ఇంకా పత్తి క్వింటాల్ పై 211రూపాయలు, కందులపై 300రూపాయలు పెరిగింది. పప్పులు, నూనె గింజలు, తృణ ధాన్యాలపై కూడా కనీస మద్దతు ధర పెరిగింది. ధరల పెంపుపై మాట్లాడిన కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, తమ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని, పంటలకి మద్దతు ధర ఉంటుందని చెప్పామని, చెప్పినట్టే ఇప్పుడు ధర కూడా పెంచామని, రైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news