ఎన్టీఆర్ కథానాయకుడు ప్రీమియర్ షో టాక్..!

-

నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోస్ యూఎస్ లో ఫినిష్ అవగా టాక్ బయటకు వచ్చేసింది. ముందునుండి ఎన్.టి.ఆర్ బయోపిక్ పై అంచనాలు ఉంటూ వచ్చాయి వాటిని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేస్తూ ఉందట ఈ సినిమా.

ఇక సినిమాలో బాలకృష్ణ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు. కథానాయకుడు సినిమాలో బాలకృష్ణ 60 డిఫరెంట్ పాత్రల్లో నటించారట. ఇక సినిమాకు క్రిష్ డైరక్షన్ అదిరిపోయిందట. సీన్ కన్ క్లూజన్ బాగా వచ్చిందట. సినిమా మొదటి భాగం చివరలో అదరగొట్టారట. ఇక కీరవాణి మ్యూజిక్, సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ కెమెరా వర్క్ కూడా అదరగొట్టాయని తెలుస్తుంది.

బాలకృష్ణ దాణ వీరశూర కర్ణ సినిమాలోని చిత్రం భలారే విచిత్రం సాంగ్ శ్రీయతో కలిసి బాలకృష్ణ బాగా చేశాడని తెలుస్తుంది. అడవి రాముడు పాట కూడా అదరగొడుతుంది. మొత్తానికి ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ కథానాయకుడు అంచనాలకు తగినట్టుగానే ఉందని టాక్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news