భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరుపతి రైల్వే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి ఉన్న బోగీలోకి రైల్వే పోలీసులు రావడంతో వ్యక్తిగత సిబ్బందిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా.. తాను ప్రయాణిస్తున్న రైల్వే కోచ్‌కు సంబంధించిన అధికారిని ప్రొటోకాల్ ఏర్పాట్లపై సున్నితంగా మందలించారు. కామన్ సెన్స్‌కు సంబంధించిన అంశమన్నారు. వెంకయ్య నాయుడు నేడు నెల్లూరు జిల్లాలో పర్యటన సందర్భంగా.. మంగళవారం రాజ్య సభ వాయిదా పడిన అనంతరం ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన తిరుపతి చేరుకుని రైల్లో నెల్లూరు జిల్లా వెంకటాచలం చేరుకున్నారు.
సమాచారం ఉన్నా..స్పందిచని అధికారులు..
జనవరి 8న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, 11న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు రానున్నారని, ఈ సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు అధికారులకు ముందే ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖుల పర్యటనపై గత శుక్రవారమే తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో వారి నుంచి వివరణ కోరనున్నారు.