భార్యాభర్తల బంధంలో మోసాలకు తావు ఉండకూడదు. కానీ, మహమ్మారి సమయంలో ఇలాంటివి పెరుగుతున్నాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అందువల్లే విడాకులు ఎక్కువ అయ్యాయి. ఐతే భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేసుకోవడానికి కారణాలేంటని విశ్లేషిస్తే కొన్ని ప్రత్యేకమైనవి బయటపడ్డాయి. అదేంటో ఒకసారి తెలుసుకుందాం.
కోపం, పగ
తమ భాగస్వామి తమని మోసం చేసాడన్న కోపంతో మోసం చేయడానికి పూనుకుంటారు. తాను మోసపోవడం వల్ల ఎలా ఫీలయ్యారో, అవతలి వాళ్ళు కూడా అలాగే ఫీలవ్వాలని అనుకుని మోసం చేస్తారు.
వైవాహిక జీవితంలో సంతోషం లేకపోవడం
ఒకరి మీద ఒకరి అంచనాలు ఫెయిల్ అవడం. తాము అనుకున్నట్టుగా అవతలి వారు లేకపోవడం. దాంతో సంతోషం తగ్గిపోయి, తమ అంచనాలకు సరిపోయే వాటిని వెతకడం.
ప్రేమ కోల్పోయినపుడు
చాలా ప్రేమలు ఎక్కువ కాలం నిలబడలేవు. ఈ విధంగా ప్రేమ తగ్గిపోయి, వేరొకరి మీద ప్రేమ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు చాలా సులభంగా మోసం చేస్తారు.
భౌతికంగా, మానసికంగా దూరం కావడం
తన పని మాత్రమే చేసుకుంటూ భాగస్వామిని పట్టించుకోకపోవడంతో తనని పట్టించుకునే ప్రేమల కోసం వెతకడం మొదలుపెడతారు. భౌతికంగా ఇక్కడే ఉంటూ మనసు మాత్రం ఎక్కడో ఉండే వారి వల్ల విరక్తి చెంది తమ మీద మనసు పెట్టే వారివైపు వెళ్ళడానికి ఇష్టపడతారు.
శారీరకంగా సుఖం లేకపోవడం
తమ భాగస్వామితో శారీరంగా సంతృప్తి పొందలేనపుడు మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువ మందిలో ఇదే ఒక కారణంగా కనిపిస్తుంది.
కొత్తదనం లేకపోవడం
బంధంలో కొత్తదనం లేకపోతే బోరింగ్ ఫీల్ కలగడం చాలా సాధరణమే. జీవితమంతా ఒకేలా సాగుతుంటే కొత్తదనం కోసం పరితపిస్తారు. ఆ పరితపింపే మోసం చేయడానికి ముఖ్య కారణం అవుతుంది. అందుకే అప్పుడప్పుడు ట్రిప్పులు లాంటివి ఖచ్చితంగా ఉండాలి.