మనిషి బలంగా ఉండాలంటే ఎముకలు బాగుండాలి. ఎముకలు బాగుండాలంటే..అందులో కాల్షియం అనే గుజ్జు ఉండాలి. లేదంటే చీమలు పట్టిన బెల్లంలా ఎముకలు గుల్లబారిపోతాయి. మనం ఏ పని చేయాలన్నా ఎముకలు సపోర్ట్ ఇస్తాయి. లేకపోతే కుర్చోలేం, నుల్చోలేం, ఏది పట్టుకోలేం కూడా.! అయితే ఎదిగే కొద్ది ఎముకల్లో కాల్షియం తగ్గుతూ వస్తుంది. అందుకే పెద్దోళ్లకు మోకాళ్లు, కీళ్లు నొప్పులు వస్తుంటాయి. మనం చేసే కొన్ని తప్పుల వల్లే ఈ కాల్షియం ఇలా కరిగిపోతుంది. మరి అవి ఏంటో చూద్దామా..!
ఈ తప్పులే ముంచుతాయి..
తరచుగా రెడ్ మీట్ ఎక్కువగా తినేవారిలో శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రొటీన్లు అందడం మొదలవుతుంది. దాని వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది.. విసర్జన సమయంలో చాలా కాల్షియం శరీరం నుంచి బయటకు వస్తుంది.
శీతల పానీయాలు, సోడా వంటి కార్బోనేటేడ్ పానీయాలను ఎక్కువగా తీసుకునే వ్యక్తులు వీక్ బోన్ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇటువంటి పానీయాలలో కాల్షియం తగ్గించే ఎక్కువ ఫాస్ఫేట్ ఉంటుంది.
కొందరు ఎసిడిటీ మందులను ఎక్కువగా తీసుకుంటారు. ఈ మందులు కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలపై ప్రభావం చూపి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
ఎముకలను దృఢంగా ఉంచుకోవాలనుకుంటే టీ-కాఫీని తీసుకోవడం తగ్గించండి. ఎందుకంటే అందులో ఉండే కెఫిన్ ఎముకలపై ప్రభావం చూపుతుంది.
ఎముకలు ధృడంగా ఉండాలంటే..
కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉన్న పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, వాల్‌నట్ వంటి డ్రై ఫ్రూట్స్ మంచిది.
స్వీట్లు, పంచదారను నియంత్రించుకోవడం మంచిది. చక్కెరకు బదులుగా బెల్లం తినొచ్చు.. బెల్లంలో శరీరానికి అవసరమైన కాల్షియం, ఐరన్ రెండూ అందుతాయి.
పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలి. జున్ను తినడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది.
ఎముకలు దృఢంగా ఉండాలంటే పచ్చి కూరగాయలు తినాలి. ముఖ్యంగా బీన్స్‌ను ఆహారంలో చేర్చుకోండి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి.
సో.. పైన చెప్పిన అలవాట్లు మీకూ ఉంటే ఇప్పటినుంచే మానేయడానికి ప్రయత్నించండి. లేదంటే 30 దాటగానే మనకు ముప్పు ముంచుకొస్తుంది అంటున్నారు నిపుణులు.
ఈ ఆర్టికల్‌లో రాసిన సమాచారం వైద్యులు, ఆరోగ్య నిపుణులు దృవీకరించిందే.. ‘మనలోకం’కు ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు