యాదాద్రి జిల్లాలోని దత్తత గ్రామం వాసాలమర్రిలో గ్రామస్తులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ భోజనం చేశారు. భోజనం అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు సిఎం కెసిఆర్. గ్రామస్తులంతా పట్టుదలతో కలిసికట్టుగా అనుకున్నది సాధించాలని.. గ్రామంలో కరోనా కేసులు లేకుండా చూసుకోవాలని సూచనలు చేసారు. తెలంగాణ ప్రభుత్వం.. వాసాలమర్రికి అండగా ఉంటుందని.. గ్రామాభివృద్ధి కోసం గ్రామస్తులు పట్టుదలతో ముందుకు పోవలాని పేర్కొన్నారు. ఏడాదిలోగా గ్రామం బంగారు వాసాలమర్రి కావాలని.. ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. కావాలంటే వాసాలమర్రికి మరో 20 సార్లు తాను వస్తానని.. వాసాలమర్రి రూపురేఖలు మారుస్తానని చెప్పారు సీఎం కేసీఆర్. గ్రామంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా నేనే చూసుకుంటానని హామీ ఇచ్చారు.
ఇవాల్టి నుంచి నా ఊరు వాసాలమర్రి అని స్పష్టం చేశారు కెసిఆర్. అలాగే వాసాలమర్రి ప్రత్యేక అధికారిగా సత్పత్తికి బాధ్యతలు అప్పగిస్తానని.. గ్రామంలోని టీచర్లు, రిటైర్డ్ ఉద్యోగులు కమిటీ ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ గ్రామాభివృద్ధి కమిటీ.. సర్పంచి తప్పుచేసిన ఫైన్ వేయాలని తెలిపారు. యాదాద్రి- భువనగిరి జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలకు 25లక్షలు మంజూరు చేస్తామని.. భువనగిరి మున్సిపాలిటీ కోటి.. మిగతా ఐదు మున్సిపాలిటీలకు 50 లక్షల చొప్పున సీఎం ఫండ్ మంజూరు చేస్తున్నామని కెసిఆర్ చెప్పారు. వాసాలమర్రి మోడల్ విలేజ్ గా చేద్దామన్నారు.