ర‌స‌వ‌త్త‌రంగా మా ఎన్నిక‌లు.. ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ఆయ‌న‌వైపేనా!

-

ఇప్పుడు క‌రోనా కాస్త త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో మా ఎన్నిక‌లు ఎజెండా మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు అధ్య‌క్షుడిగా ఉన్న న‌రేశ్, ఆయ‌న ప్యాన‌ల్ గ‌డువు ముగియ‌డంతో ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. దీంతో ఇప్పుడు మా అధ్య‌క్ష బ‌రిలో జీవిత రాజ‌శేఖ‌ర్‌, ప్రకాశ్ రాజ్‌, మంచు విష్ణు, న‌టి హేమ ఉన్నారు. ఇందులో జీవిత‌, మంచు విష్ణు, న‌టి హేమ‌లు ఇదివ‌ర‌కే మా ప్యానెల్‌లో వివిధ స్థాయిల్లో ప‌నిచేశారు.

మా ఎన్నిక‌లు

అయితే ఇందులో ప్ర‌కాశ్ రాజ్‌కే మెగాస్టార్ ఫ్యామిలీ స‌పోర్టు ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా ఇంకోవైపు మంచు విష్ణుకోసం ఆయ‌న తండ్రి మోహ‌న్‌బాబు రంగంలోకి దిగారు. ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌ను క‌లుస్తూ మ‌ద్దతు కోరుతున్నారు. నిన్న సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను క‌లిశారు. ఇక ప్ర‌కాశ్ రాజ్ విష‌యానికి వ‌స్తే గ‌తంలో రెండు సార్లు ఆయ‌న‌పై నిర్మాత‌లు ఫిల్మ్ ఛాంబ‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయ‌న టైమ్‌కు సెట్ కు రాకుండా ఉంటార‌ని అలాగే చివ‌రి నిముషంలో డేట్స్ లేవ‌ని వాయిదా వేస్తార‌ని ఫిర్యాదులు ఉన్నాయి.

ఇంకోవైపు ఆయ‌న జ‌న్మ‌స్థ‌లం కూడా ఇక్క‌డ చ‌ర్చ‌కు రావ‌చ్చ‌ని చెబుతున్నారు. ఇక జీవిత రాజ‌శేక‌ర్ గ‌తంలో చాలా ప‌ద‌వుల్లో ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ఈమె మా కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్నారు. కాక‌పోతే మెగా ఫ్యామిలీతో వీరికున్న వివాదాలు క‌లిసి రాక‌పోవ‌చ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. పోయిన‌సారి న‌రేశ్ ప్యాన‌ల్‌కు చిరంజీవి స‌పోర్టు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక మిగిలిన న‌టి హేమ కూడా ఉపాధ్య‌క్షురాలిగా, ఇత‌ర ప‌ద‌వుల్లో చేసిన అనుభ‌వం ఉంది. కాక‌పోతే ఆమెకు పెద్ద‌గా స‌పోర్టు లేద‌నే చెప్పాలి. పైగా ఇప్పుడు మంచువిష్ణు పోటీ చేయ‌డంతో ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ఆయ‌న‌కే స‌పోర్టు చేసే ఛాన్స్ ఉంది. చూడాలి మ‌రి వీరిలో ఎవ‌రి ప్యానెల్ గెలుస్తుందో.

Read more RELATED
Recommended to you

Latest news