ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం రాజుకుంటున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై కడుతున్న ప్రాజెక్టులు అక్రమమైనవని, వాటిపై పోరాటం చేస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. ఇక కేసీఆర్ తరఫున మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ రంగంలోకి దిగి ఏపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక వీరి కామెంట్స్‌పై వైసీపీ నేతలు కూడా స్పందిస్తున్నారు.
వైసీపీ మంత్రి నాని స్పందిస్తూ తెలంగాణ మంత్రులు, ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని వెల్లడించారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని కొంచెం గట్టిగానే కౌంటర్ విసిరారు. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు.
ఏపీ మంత్రి నాని, వైసీపీ నేత రామచంద్రయ్య ఆస్తులు తెలంగాణలోనే ఉన్నాయని, కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. అంటే దాని అర్థం ఎక్కువ మాట్లాడితే ఆస్తులకు ఇబ్బందులు వస్తాయని ఇన్ డైరెక్టుగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అంటున్నారన్న మాట. మొత్తానికి నీళ్ల జగడం మంత్రుల మధ్య చిచ్చు పెడుతోందన్న మాట. మరి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలపై నాని ఏమైనా స్పందిస్తారో లేదో చూడాలి.