వైఎస్ షర్మిల తన కొత్త పార్టీపై కీలక ప్రకటన చేసారు. అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ఆమె… జులై 8వ తేదీన పార్టీ Ysrtp ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు వైయస్ షర్మిల. ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు ఎంతో అవసరమని… కానీ అవన్నీ చేయలేనివి చేసేదే 5th ఎస్టేట్ అని పేర్కొన్నారు. ప్రజల చేతుల్లో ఉన్నా ఆయుధం సోషల్ మీడియా అని… అలాంటి సోషల్ మీడియాకు హ్యాట్సాఫ్ అని తెలిపారు.
రాజన్న రాజ్య స్థాపనే తన ధ్యేయమని…విద్య, వైద్యం అన్ని ఉచితంగా ఇవ్వడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అన్ని కులాలు, మాటలకీ అతితంగా పార్టీ ఉంటుందని..ఇలాంటివన్నీ చేయాలంటే సోషల్ మీడియా అవసరమని చెప్పారు. మీరు లేకుండా నేనేం చేయలేనని చెప్పారు..టీఆరెస్ కు సోషల్ మీడియాకు ఎంప్లాయిస్ ఉన్నారనీ… టీడీపీ నాయకుడిని తీసుకొచ్చి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ని చేశారని ఎద్దేవా చేసారు. వాళ్లకు కూడా సోషల్ మీడియా ఎంప్లాయిస్ ఉన్నారని…కానీ మనకు ఆ అవసరం లేదన్నారు.సోషల్ మీడియా లేకుండా ఎలాంటి పని ముందుకు సాగదని..మీ లైక్స్, షేర్ అన్ని వేదికల్లో యాక్టివ్ గా ఉండాలి, అన్యాయాన్ని ఎదిరించాలని పిలుపు ఇచ్చారు. తప్పుడు, పేక్ న్యూస్ ని తగ్గించాలని షర్మిల పేర్కొన్నారు.