తెలంగాణ సీఎం బాటలో ఏపీ సీఎం చంద్రబాబు…

-

తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పయనిస్తున్నారు. తెలంగాణలో పింఛన్లను పెంచిన విధంగా చంద్రబాబు ఏపీలోనూ పెంచి సంక్రాంతి కానుకగా ప్రజలకు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా… సంక్రాంత్రి కానుకగా పింఛన్లు రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి నుంచే ఇది ఆమోదంలోకి వస్తుందని వెల్లడించారు. జనవరికి సంబంధించిన పెన్షన్ ఇప్పటికే పంపిణీ చేశారు కాబట్టి.. పెంచిన పింఛన్ ఫిబ్రవరిలో అందజేస్తామని తెలిపారు. 2014కు ముందు పింఛన్ నెలకు రూ.200మాత్రమే. టీడీపీ అధికారంలోకి వచ్చాక నెలకు రూ.1000కి పెంపు చేశారు. తాజాగా దీన్ని రూ.2000 కు పెంచడంతో పించనుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పక్క రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ అమలు చేసిన ఫార్ములా వల్ల అటు ప్రజాసంక్షేమంతో పాటు ఇటు పార్టీకి ప్రయోజనం చేకూరనుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
పింఛన్ పెరుగుదల…
వృద్దాప్య, వితంతు, చేనేత పెన్షన్,మత్స్యకారులు, గీతకార్మికుల పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్, కళాకారుల పెన్షన్, డప్పు కళాకారుల పెన్షన్లలను రూ.1000 నుండి రూ.2000వేలకు పెంచనున్నారు.  ట్రాస్ జెండర్స్(హిజ్రాలు) పెన్షన్, చర్మతోలు వృత్తి దారుల పెన్షన్ వికలాంగుల పెన్షన్లను రూ.1,500 నుండి ,రూ.3000లుగా, కిడ్నీ వ్యాధిగ్రస్తుల పెన్షన్ రూ.2,500 నుండి రూ.5,000లు చెల్లించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news