మొసలి మరణిస్తే ఊరంతా కన్నీరు పెట్టుకుంది..!

-

హవ్వా.. మొసలి మరణిస్తే ఊరంతా కలిసి పండుగ చేసుకోవాలి కానీ.. ఇలా కన్నీరు పెట్టుకోవడం ఏంది.. అని అంటారా? అది మామూలు మొసలి అయితే.. మీరన్నట్టు వాళ్లు పండుగే చేసుకునేవాళ్లు. కానీ.. దానికి, ఆ ఊరికి అవినాభావ సంబంధం ఉంది. ఆ మొసలి ఆ ఊరి దైవం. దాదాపు 130 ఏళ్ల వయసు ఉన్న ఆ మొసలిని తమ ఊరును కాపాడే దైవంగా పూజిస్తారు ఆ గ్రామ ప్రజలు. అందుకే.. అది మరణించడంతో ఊరంతా కన్నీరు పెట్టుకుంది.

ఊరు ఊరంతా కదిలి వచ్చి ఆ మొసలికి సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేశారు. ఈ అరుదైన, ఆసక్తికరమైన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బెమితార జిల్లాలోని మహోతార గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామస్తులంతా దాన్ని కడసారి చూసి.. కడసారి తాకి ఆశీర్వాదాలు పొందిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఆ మొసలి ఆ ఊరికి సమీపంలో ఉన్న చెరువులో నివసించేది. ఆ చెరువు దగ్గరే దానికి ఓ స్మారక చిహ్నం, ఊళ్లో గుడి కట్టనున్నట్టు గ్రామస్తులు తెలిపారు. తన 130 ఏళ్ల జీవిత కాలంలో ఆ మొసలి ఎవరికీ ఏ హానీ తలపెట్టలేదట. చెరువులో చేపలు పట్టేటప్పుడు కానీ.. పిల్లలు ఈతకు వెళ్లినప్పుడు కానీ.. వాళ్లు పక్క నుంచి వెళ్లినా.. ఎవరినీ ఏమీ అనేలేదట. అందుకే.. దాన్ని దైవంగా కొలిచారు ఆ గ్రామస్తులు.

Read more RELATED
Recommended to you

Latest news