ఉద్యోగం పేరుతో దారుణం.. హైదరాబాద్ యువతిని ట్రాప్ చేసి మరీ !

-

హైదరాబాద్ ఘరాన మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పేరుతో 7 లక్షల 50 వేలు నొక్కేశారు సైబర్ కేటుగాళ్లు. జాబ్ సైట్ లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న యువతీని ట్రాప్ చేసిన కేటుగాళ్లు ఏడున్నర లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్స్ ఏసిపి కెవిఎమ్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..బోరబండకు చెందిన యువతీ అన్నపూర్ణ ఇటీవల షైన్ డాట్ కామ్ జాబ్ సైట్ లో ఉద్యోగం కోసం పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంది. రెండు రోజుల క్రితం రాహుల్ జైన్ అనే వ్యక్తి ఆమెకు కాల్ చేసి మీరు జియో కస్టమర్ కేర్ లో ఉద్యోగానికి ఎంపికయ్యారని చెప్పాడు.


ప్రాసెసింగ్ చార్జీలు ఆన్లైన్ ద్వారా చెల్లిస్తే మీ అపాయింట్మెంట్ కంఫర్మ్ చేసి అఫీషియల్ మెయిల్ నుండి లెటర్ పంపిస్తామని నమ్మబలికాడు. దీంతో మొదట రూ.లక్ష తర్వాత యాభై వేలు.. ఆలా మొత్తం అన్నపూర్ణ దగ్గరి నుంచి రూ. 7.45 లక్షలు వసూల్ చేసి తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసాడు. దీంతో మోసపోయానని గ్రహించిన అన్నపూర్ణ.. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు సైబర్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news