పీసీసీ పదవికే.. పీఎంలా బిల్డప్ : రేవంత్ పై కేటీఆర్ సెటైర్

-

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డి పై సెటైర్ వేశారు. సోనియా ను ఇపుడు రేవంత్ తెలంగాణ తల్లి అంటున్నాడని…ఆయనే గతం లో సోనియా ను బలి దేవత అన్నాడని చురకలంటించారు.రేపు చంద్రబాబు ను తెలంగాణ తండ్రి అన్నా అంటాడని…ఆయనకు టీడీపీ పాత వాసనలు పోలేదని ఎద్దేవా చేశారు. టీ పీ సీ సీ కాదు తెలుగు దేశం కాంగ్రెస్ అని కాంగ్రెస్ నేతలే అంటున్నారని…నోట్ల కొట్టలతో దొరికినోడు నీతులు చెబుతున్నాడని మండిపడ్డారు.

పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొట్టాలంటున్నాడని…నువ్వు మారావు కదా ఏ రాయి తో కొట్టాలని ఫైర్ అయ్యారు. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ కూడా అదే చేశారు ? ఆయన్ను కూడా రాయితో కొట్టాలా ? అని ప్రశ్నించారు. చిన్న పదవి రాగానే పీఎం పదవి వచ్చినట్టు బిల్డ్ అప్ ఇస్తున్నాడని సెటైర్ వేశారు.

కొత్త సినిమా విడుదలైనప్పుడు ఆగమాగం బ్యాచ్ లా ఉంది రేవంత్ తీరు ఉందని.. మొరిగే కుక్కలను పట్టించుకోవద్దన్నారు. అధికారం గుంజుకుంటే వచ్చేది కాదని… అది ప్రజలు ఇస్తే వస్తుందని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news