అలైన్ మెంట్ మార్పుపై సీబీఐ విచారణ : వేముల ప్రశాంత్ రెడ్డి

-

రీజినల్ రింగ్ రోడ్ దక్షిణభాగం అలైన్ మెంట్ మార్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూదందాలకు తెరలేపుతోంది అని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం అలైన్ మెంట్ ఆమోదం పొందింది, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేదు. స్వలాభం ఉందా లేదా అని కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది నెలల్లో చూసుకొంది. స్వలాభం కోసం రీజినల్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మారుస్తూ పేదల భూముల్లో నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణ భాగం భూసేకరణ, రోడ్డు కోసం రాష్ట్రం 2500 కోట్లు, కేంద్రం 12,500 కోట్లు ఖర్చు పెట్టాలి. కాంగ్రెస్ నేతల భూములు ఉన్న వైపు అలైన్ మెంట్ మారుస్తున్నారు. సాగర్ రోడ్ లో గొల్లపల్లి గ్రామం నుంచి గ్రామానికి, శ్రీశైలం రోడ్డులో దాదాపు నాలుగు కిలోమీటర్లు దూరానికి మార్చారు. ఫోర్త్ సిటీ సౌలభ్యం కోసం అలైన్ మెంట్ మారుస్తున్నామని అన్నారు.

ఫోర్త్ సిటీ, పాత అలైన్ మెంట్ మధ్య దూరం 10 కిలో మీటర్లు ఉంటే కొత్త అలైన్ మెంట్ మధ్య దూరం 12 కిలో మీటర్లు అయింది. అలైన్ మెంట్ మార్పుతో ఫోర్ట్ సిటీకి దూరమైంది. మాడుగుల గ్రామం సీఎం బంధువులది, అక్కడ ఏం జరుగుతోంది.. చేవెళ్ల మార్గంలో అంగడి చిట్టెంపల్లి నుంచి ఐదు కిలోమీటర్లు జరిగి మన్నెగూడ క్రాస్ రోడ్స్ కు మార్చారు. మన్నె గూడ సమీపంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేతల భూములు ఉన్నాయని ప్రజలు చెప్తున్నారు. బిగ్ బ్రదర్స్ భూములు సేకరించి పెట్టుకున్నారని అంటున్నారు. కాంగ్రెస్ నేతల భూములు ఉన్న వైపు అలైన్ మెంట్ మారుస్తున్నారు.ఇందులో బిగ్ బ్రదర్స్ హస్తం ఉంది. అన్ని అంశాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కోరుతున్నాను. అలైన్ మెంట్ మార్పు వ్యవహారంపై సీబీఐ విచారణ చేయకపోతే కాంగ్రెస్, భాజపా ఒక్కటే అని భావించాల్సి వస్తుంది అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news