కూటమీ ప్రభుత్వం వచ్చాక లడ్డులో నాణ్యత పెరిగిందని భక్తులే చేబుతున్నారు అని మంత్రి నారా లోకేష్ అన్నారు. నెయ్యి విషయం ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. లడ్డుపై అధారాలతో సహా ప్రజల ముందు పెట్టాం. మోడీకి.. సుప్రీంకోర్టు జడ్జికి లేఖ జగన్ రాయడం అంటే.. దోంగే దోంగాన్నట్లుంది.. జగన్ తప్పు చేసి ఆయనే లేఖ రాయడం ఏంటి అని ప్రశ్నించారు నారా లోకేష్. 24 గంటల అయ్యింది నేను వైవీ సుబ్బారెడ్డి ఛాలెంజ్ చేసి.. రండి తిరుమలకు ప్రామానం చేద్దామని ఇప్పటి రాలేదు… పారిపోయాడు. వైవీ సుబ్బారెడ్డి మీదా జగన్ లేఖ రాయమనండి.
తిరుమలలో అన్నదానం, క్యూ కాంప్లెక్స్ నిర్మాణం, ప్రాణదానం సహా చాలా పనులు ప్రారంభించింది టీడీపీ. దేవాన్షు పుట్టిన రోజు నాడు తిరుమలలో మూడు పూటల అన్నదానం చేస్తున్నాం. టీటీడీనీ రాజకీయ పునవాసకేంద్రంగా వాడుకున్నారు వైసీపీ నేతలు. వాస్తవాలను దైర్యంగా ప్రజలు ముందు పెట్టాం… జగన్ లా పరదాలు కట్టుకుని తిరగడం లేదు. మంచి అధికారులను నియమించాము, టీటీడీని ప్రక్షాళన చేస్తాం అని నారా లోకేష్ పేర్కొన్నారు.