తెలుగు ఇండస్ట్రీలోకి పెద్ద హీరో అయిన మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కియారా(Kiara). కానీ ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో నటించిన వినయ విధేయ రామ పెద్ద డిజాస్టర్ కావడంతో స్టార్ హీరోయిన్ ఆశలు గల్లంతయ్యాయి. ఆమెకు టాలీవుడ్ లో ఆదిలోనే ఎదురు దెబ్బ తగలడంతో రూటు మార్చి బాలీవుడ్ కు చెక్కేసింది ఈ హాట్ బ్యూటీ.
ఇక అక్కడ బాగానేఏ మూవీలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది ఈ సొగసరి ముద్దుగుమ్మ. ఆమె దాదాపు రెండేళ్లుగా బాలీవుడ్‌లోనే సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మారేందుకు చాలా కష్టపడుతోంది. ఆ మేరకు కూడా ఆమె ఆశించిన స్థాయిలోనే రాణిస్తోంది. అయితే రీసెంట్‌గా ఆమె చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు.
ఆమె హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటికి వెళ్లినప్పుడు తన సంస్కరాన్నిచూపించుకుంది. సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటికి చేరుకోగానే తన కారు డోర్‌ను అక్కడ ఉన్న వయసు పైబడిన పెద్దాయనతో తీయంచి, కనీసం ఆయనకు కృతజ్ఞత కూడా చెప్పకుండా తన దర్పాన్ని ప్రదర్శించడం ఇప్పుడు నెట్టింట సంచనంగా మారింది. దీంతో ఆమె సంస్కారనికి నెటిజన్లు మండిపడుతున్నారు. మరీ ఇంత పొగరేంటని దుమ్మెత్తి పోస్తున్నారు.