నేటి కుర్రకారుకు సవాల్ విసురుతోన్న 73 ఏళ్ల బామ్మ.. వీడియో

-

73-year-old pole dancer granny video goes viral

73 ఏళ్లు ఉన్న వాళ్లు ఏం చేస్తారు. కృష్ణా రామా అంటూ ఇంట్లో ఓ మూలకు కూర్చొని… కాటికి కాలు చాపి… ఎప్పుడు దేవుడు పిలుస్తాడా? అని ఎదురు చూస్తుంటారు. హేయ్.. ఇదంతా ఓల్డ్.. ఈ జనరేషన్ వేరప్పా.. అంటూ 73 ఏళ్లు ఉన్న ఓ బామ్మ… పోల్ డ్యాన్స్ చేసి అదరగొడుతోంది. నేటి యూత్ కు సవాల్ విసురుతోంది. 30 ఏళ్లకే అమ్మా.. అయ్యా.. అంటూ మూలుగుతూ రోజులు వెళ్లదీసేవాళ్లు ఉన్న ఈ రోజుల్లో ఈ బామ్మను నిజంగా ఒప్పుకోవాల్సిందే. బామ్మ సాహసం చూసి నేటి యూత్ చాలా నేర్చుకోవాల్సి ఉంది.

చైనాకు చెందిన ఆ బామ్మ పేరు డయా డాలి. ఆమె చేసిన పోల్ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాదు.. ఆమె తన శరీరాన్ని ఎటు అంటే అంటూ మలిచేస్తూ.. వంచేస్తూ చేస్తున్న డ్యాన్స్ చూసి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ఏంది బామ్మా నువ్వు… ఈ వయసులో కూడా ఇంత ఫిట్ నెసా? అంటూ ముక్కన వేలేసుకుంటున్నారు. తనకు 65 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఈ పోల్ డ్యాన్స్ ను నేర్చుకున్నదట బామ్మ. అది సంగతి.

Read more RELATED
Recommended to you

Latest news