నేటి నుంచి సావరింగ్‌ గోల్డ్‌బాండ్స్‌ విక్రయం!

-

గోల్డ్‌ బాండ్స్‌(Gold Bonds) రూపంలో పెట్టుబడులు పెట్టడానికి ఎదురుచూస్తోన్న వారికి శుభవార్త. ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకుల్లో గోల్డ్‌ బాండ్స్‌ అమ్మకాలు మొదలుకానున్నాయి. సాధారణంగా ఇవి ప్రభుత్వరంగ బాండ్లు. ఆర్‌బీఐ ఆధ్వర్యంలో దీన్ని విక్రయిస్తారు. జూలై 12 నుంచి 16 తేదీ వరకు చిన్న తర హా బ్యాంకులు మినహా అన్ని బ్యాంకుల్లో వీటిని విక్రయిస్తారు. ఈ ప్రభుత్వరంగ సెక్యూరిటీస్‌ను గ్రాముల్లో అమ్ముతారు. ఫిజికల్‌ గోల్డ్‌కు బదులుగా ఇవి బాండ్ల రూపంలో ఉంటాయి. ఈ ఏడాది (2021–22) సావరింగ్‌ గోల్డ్‌ సిరీస్‌ IV గ్రాము ధర రూ.4,807 గా నిర్ణయించింది. పెట్టుబడిదారులు వీటిని ఇష్యూధరకు క్యాష్‌ రూపంలో కొనవచ్చు. మెచ్యూరిటీ పూర్తయ్యాక మళ్లీ డబ్బులను అప్పటి బంగారం ధరకు సమానమైన డబ్బును పొందుతారు.

గోల్డ్‌బాండ్స్‌/Gold Bonds
గోల్డ్‌బాండ్స్‌/Gold Bonds

ఈ బాండ్లను ఆన్‌లైన్‌లో కొనుగోళు చేసే పెట్టుబడిదారులకు గ్రాముకు 50 శాతం డిస్కౌంట్‌ను పొందుతారు. కేవలం డిజిటల్‌ మోడ్‌లో డబ్బు చెల్లించిన వారికి ఇది వర్తిస్తుందన్నమాట. ఆన్‌లైన్‌ పెట్టుబడిదారులకు సావరింగ్‌ గోల్డ్‌ బాండ్‌ గ్రాము ధర రూ.4,757 కే పొందుతారని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. వీటిని బ్యాంకులతోపాటు పోస్టాఫీస్, కేంద్ర ప్రభుత్వం గుర్తించిన స్టాక్‌ మార్కెట్లో కూడా విక్రయిస్తున్నారు. అంటే నేషనల్‌ స్టాక్‌ ఎక్సె ్ఛంజ్, ఆఫ్‌ ఇండియా, బీఎస్‌ఈ. ఈ సావరింగ్‌ గోల్డ్‌ బాండ్స్‌ను కనిష్టంగా ఒక్క గ్రాము నుంచి విక్రయిస్తారు. దీని మెచ్యూరిటీ సమయం 8 సంవత్సరాలు. 5 ఏడాది నుంచి బాండ్స్‌ వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సావరింగ్‌ గోల్డ్‌ బాండ్స్‌ కొనుగోళు చేయాలనుకునేవారు 1 గ్రాము నుంచి గరిష్టంగా 4 కేజీల వరకు కొనుగోలు చేయవచ్చు. ఇది వ్యక్తికి, హిందూ అన్‌డివైడెడ్‌ ఫ్యామిలీస్‌కు వర్తిస్తుంది. ట్రస్టులకు గరిష్టంగా 20 కేజీల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ప్రతి ఏడాది ఈ సావరింగ్‌ గోల్డ్‌ బాండ్స్‌ దాదాపు రూ.25,702 కోట్లు విలువ కలిగిన విక్రయాలు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news