టీఆరెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న అనంతరం… ఎల్. రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు టిఆర్ ఎస్ పార్టీలో చేరాననని.. ఇందులో భాగంగానే ఈ రోజు పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నాననని స్పష్టం చేశారు. ఇక నుంచి సిఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం.. అంకిత భావంతో పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాదరణ పొందిన ఏకైక పార్టీ టిఆర్ఎస్ అని.. తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం ఉపయోగించాలని సీఎం కెసిఆర్ సూచించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి కలిసి రావాలని సిఎం కేసీఆర్ తనను కోరారని ఎల్. రమణ చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కొరకు టీఆరెస్ పార్టీలోకి రావాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు టీఆరెస్ ప్రభుత్వం అమలు పరుస్తోందని వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సిఎం కేసీఆర్ కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నానని స్పాషయటం చేశారు ఎల్. రమణ.