ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగు(Thunder)లు బీభత్సం సృష్టించాయి. పిడుగుల ధాటికి పదుల సంఖ్యలో మనషులు చనిపోయారు. పిడుగులు పడడంతో నిన్న ఒక్క రోజే 68 మంది మృతి చెందారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. రాజస్థాన్‌లో 20 మంది, మధ్యప్రదేశ్‌లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పిడుగులు పడడంతో పలు చోట్ల పశువులు కూడా చనిపోయాయి.
ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో నిన్న ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగులు పడడంతో ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో 41 మంది చనిపోయారు. అందులో మహిళలతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు. ఒక్క ప్రయాగ్‌రాజ్‌లోనే 13 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో పశువులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు
ఇక రాజస్థాన్‌లో పిడుగుల ధాటికి 20 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. 12వ శతాబ్దంనాటి అమెర్ ప్యాలెస్ సమీపంలోని క్లాక్‌టవర్‌పైకి ఎక్కి ప్రజలు సెల్ఫీలు తీసుకుంటుండగా పిడుగులు పడ్డాయి. ఈ సమయంలో సెల్ఫీలు తీసుకుంటుండగా పిడుగు పడి పలువురు మరణించారు. టవర్‌పై ఉన్న కొందరు ప్రాణభయంతో కిందికి దూకడంతో గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రకటించారు