రామారావు గారు.. ఉన్నట్టా.. లేనట్టా..!

-

టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ డైరక్టర్ గురించి బాగా చర్చించుకుంటున్నారు. జంధ్యాల, ఈవివి తర్వాత తెలుగు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వించే సినిమాలను తీసే దర్శకుడు అతనే అంటూ చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఎవరతను అంటే ఇంకెవరు ఎఫ్-2 డైరక్టర్ అనీల్ రావిపుడి అంటున్నారు. పటాస్ నుండి ఎఫ్-2 వరకు డైరక్టర్ అనీల్ రావిపుడి ఏం చేసినా అది సూపర్ హిట్ సినిమానే.

కమర్షియల్ సినిమానే అయినా అందులో కామెడీ ఏమాత్రం మిస్సవ్వకుండా చేస్తున్నాడు అనీల్. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేసిన ఈ మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2 బాక్సాఫీస్ దగ్గర విజయ ఢంకా మోగించింది. ఈ సినిమాతో అనీల్ రావిపుడి మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అనీల్ రావిపుడి తర్వాత సినిమా మీద అందరి దృష్టి పడింది.

అసలైతే అనీల్ రావిపుడి నందమూరి బాలకృష్ణతో సినిమా ఉంటుందని ఎనౌన్స్ చేశాడు. బాలయ్య 100వ సినిమా టైంలోనే రామారావు గారు అంటూ ఓ పవర్ ఫుల్ పోలీస్ కథ చెప్పాడు అనీల్. కథ నచ్చినా 100వ సినిమా ప్రత్యేకంగా ఉండాలన్న ఉద్దేశంతో అనీల్ ను కాదని క్రిష్ తో చేతులు కలిపాడు బాలకృష్ణ. ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో సినిమా ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత సినిమా అనీల్ రావిపుడితోనే అంటున్నారు. మరి బాలకృష్ణతో కూడా అనీల్ చేసేది ఇలాంటి కామెడీ సినిమానేనా కాదా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news