అమెజాన్‌లో కొబ్బరి చిప్పకు రూ.1300.. నెటిజన్లు ఫైర్

-

కోతికి కొబ్బరి చిప్ప దొరికిందన్నట్టు.. అమెజాన్‌కు ఖాళీ కొబ్బరి చిప్ప దొరికినట్టుంది. దీన్ని క్యాష్ చేసుకోవాలనుకున్నట్టుంది. అందుకే… అమెజాన్ ఈకామర్స్ సైట్‌లో కొబ్బరి చిప్పను 1300 రూపాయలకు అమ్ముతున్నారు. షాకయ్యారా? అసలు ఖాళీ కొబ్బరి చిప్పను ఏం చేసుకుంటారు. కొబ్బరి కాయ ధరే 20 రూపాయలు ఉండదు. అమెజాన్.. ఖాళీ కొబ్బరి చిప్పను 1300 రూపాయలకు అమ్మడమేందని అంటారా? మీరే కాదు.. నెటిజన్లు కూడా అదే ప్రశ్నించారు. 20 రూపాయలు కూడా ఉండని కొబ్బరి చిప్పకు 1300 ఏంది చోద్యం కాకపోతే అంటూ అమెజాన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి దాని ధర 3 వేల రూపాయలట. కానీ.. డిస్కౌంట్‌లో 1300 కే ఆఫర్ ద్వారా ఇస్తున్నారట. వామ్మో.. పనికిరాని కొబ్బరి చిప్పకు 3 వేలు. పైగా ఆఫర్ ఒకటి. అమెజాన్ మాత్రం ఈ కొబ్బరి చిప్ప ప్రాడక్ట్‌పై ఇంకా స్పందించలేదు. ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news