కరోనా వలన ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి…? చికిత్స చేయించుకోవడానికి డబ్బులు సరిపోవడం లేదా..? అయితే మీకు మంచి లోన్ ఫెసిలిటీ వుంది. ఇలా కనుక లోన్ తీసుకుంటే చికిత్స చేయించుకోవడానికి డబ్బులు అందుతాయి. పైగా సమస్యలు కూడా వుండవు. అయితే మరి ఈ లోన్ కోసం పూర్తి వివరాలలోకి వెళితే..మీరు కనుక ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ.. కరోనా కోసం చికిత్స చేయించుకోవాలంటే ఈ లోన్ తీసుకోవడం మంచిది. అయితే బ్యాంకులు కోవిడ్ పర్సనల్ లోన్స్ ని ఇస్తున్నాయి. ఇంకా 6 నెలలు ఈఎంఐ (EMI) కూడా కట్టక్కర్లేదు.
వీటి ద్వారా మీకు చక్కని ప్రయోజనం కలుగుతుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా BOI కూడా కస్టమర్లకు కోవిడ్ రుణాలు ఇస్తోంది.
ఆ ప్రాసెస్ గురించి చూస్తే.. బ్యాంక్ ఆఫ్ ఇండియా BOI కూడా రుణాలు ఇస్తోంది కానీ ఈ అవకాశం అందరికీ లేదు. కేవలం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్ కలిగిన వాళ్ళకే అవుతుంది. బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్, హోమ్ లోన్ తీసుకున్న వారికి కూడా ఈ లోన్ తీసుకునే అవకాశం వుంది.
ఇలా కోవిడ్ రుణాల కింద బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.5 లక్షల వరకు రుణం పొందొచ్చు. మూడేళ్లలోగా వాటిని చెల్లించాలి. ఆరు నెలల మారటోరియం ఫెసిలిటీ ఉంటుంది. ఈ లోన్ పై 6.85 శాతం వడ్డీని తీసుకోవడం జరుగుతుంది.