వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఎన్నో అంచనాలతో తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే కనీసం ఆమెను ఎవరూ పట్టించుకోని స్థితికి దిగజారిపోయింది. అదే ఏపీలో ఉంటే జగన్‌కు చెల్లెలుగా రాజకీయా్లో చక్రం తిప్పేది. కానీ వాటిని వద్దనుకుని తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే ఆమెను కనీసం పట్టింకునే వారే లేని స్థితికి ఆమె పరిస్థితి వచ్చింది కనీసం ప్రతిపక్షంగా కూడా ఒప్పుకోవట్లేదు. మరి ఇలాంటి ఛాన్స్ దొరికితే నెటిజన్లు ఊరుకుంటారా అందుకే ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుంటున్నారు.
వీలు కుదిరినప్పుడల్లా ఆమె టీఆర్ ఎస్ పార్టీపై అలాగే కేసీఆర్‌పై సంచలన కామెంట్లు చేస్తున్నారు. అదే విధంగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై కూడా సంచలన కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలా కామెంట్లు చేసే క్రమంలో మొన్న ఓసారి మంత్రి కేటీఆర్ అంటే ఎవరమ్మా అని కూడా సంచలన కామెంట్లు చేశారు.
ఆమె ఇంతలా కామెంట్లు చేస్తున్నా కూడా అవతలి పార్టీలు నుంచి గానీ లేదా అవతలి నేతల నుంచి కూడా కనీసం రియాక్షన్ లేకపోవడంతో నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. షర్మిలను కనీసం ప్రత్యర్థిగా గానీ లేదా ఆమె రాజకీయాల్లో ఉందని గానీ టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు గుర్తించట్లేదని దారుణమైన ట్రోలింగ్ మొదలు పెట్టారు. కనీసం ఆమెను గుర్తించాలని కోరుతున్నారు.