నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో రోడ్డు ఘోర ప్రమాదం…8 మంది మృతి

-

నాగర్ కర్నూల్ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై రెండు కార్లు ఒకదానికొకటి ఢీ కొట్టాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా ఎనిమిది మంది మృతి చెందారు. అచ్చంపేట మండలం చెన్నారం గేట్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసేకున్నట్లు సమాచారం అందుతోంది.

రెండు కార్లు ఢీ కొట్టుకోవడం తో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా… మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే.. ప్రమాదం జరిగి చోట ఉన్న స్థానికులు అప్రమత్తమై… అటు పోలీసులకు ఇటు అంబులెన్సుకు ఫోన్‌ చేశారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్‌ ద్వారా తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు… మృత దేహాలను వెలికి తీస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదంలో ఎవరి తప్పిదం వల్ల జరిగిందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news