తెలంగాణ రాజకీయాలు మంచి జోరుమీదున్నాయి. ఇప్పుడు వరుసగా అన్ని పార్టీల్లో పెద్ద సంచలన మలుపులు తిరుగుతున్నాయి. టీఆర్ ఎస్ లో ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఒక వంతు అయితే రీసెంట్ గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకోవడం ఇంకో ఎత్తు. ఇక బీజేపీలోకూడా వర్గపోరు నడుస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా పార్టీలు కూడా వస్తున్నాయి. షర్మిల నూతనంగా పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.కాగా ఇప్పుడు ఆర్.ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ పదవికి వీఆర్ ఎస్ ద్వారా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
అయితే ఆయన ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర ఎస్ తరఫున పోటీ చేసేందుకు నిల్చున్నారనే ప్రచారం జోరందుకుంది. అదే క్రమంలో ఇంకోవైపు ఆయన కొత్తగా పార్టీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని అంతా అంటున్న టైమ్‌లో వీటిపై ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.
తాను బహుజనుల కోసమే పోరాడుతానని, బహుజనులే కేంద్రంగా త్వరలో కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారుర. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే అనుమానాలకు మరింత బలం చేకూరిది. అయితే తన ఎంట్రీ ఎప్పుడు ఉంటుందనే విషయంపై మాత్రం ఆయన వివరణ ఇవ్వలేదు. త్వరలోనే అన్నట్టు మాత్రం సంకేతాలు ఇచ్చారు. దీంతో ఇప్పుడు రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఇమేజ్ ఉన్న ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో రావడం కొంత మంచిదే అని చెప్పాలి.