ఏపీలో ఈ నెల 30 నుంచి జరగాల్సిన శాసనసభ బడ్జెట్ సమావేశాలను వాయిదా పడ్డాయి. అయితే ఫిబ్రవరి 4 నుంచి 11 మధ్య అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ, కొత్త పథకాల ప్రకటన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను వాయిదా పడ్డాయి. దీంతో బడ్జెట్ సమావేశాల నిర్వహణకు మరో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. విధాన పరమైన నిర్ణయాలు, ఇతర సంక్షేమ పథకాల అమలు సందర్భంగా సమావేశాలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.